తెలంగాణ యునైటెడ్ మెడికల్ @ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(CITU )జనవరి 4న జరిగే రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయండి ప్రభుత్వ మానసిక వైద్యశాల ఎర్రగడ్డలో పోస్టర్ ఆవిష్కరించిన యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ మానసిక హాస్పిటల్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కు జీవో 60 ప్రకారం కనీస వేతనాలు కూడా ఇవ్వటం లేదని ఈఎస్ఐ, పిఎఫ్ సక్రమంగా అమలు చేయాలని కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ పర్మినెంట్ చేస్తామని తెలంగాణ పోరాటంలో ఇచ్చిన వాగ్దానాలను సీఎం కేసీఆర్ అమలు చేయాలని ఈ మహాసభ లో డిమాండ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ మానసిక వైద్యశాల ప్రత్యేకమైనటువంటిది ఇందులో పనిచేసే అటువంటి వర్కర్ లందరికీ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అలవెన్సులు ఇచ్చి వారికి ప్రత్యేకంగా వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ ప్రభుత్వం కార్మికులను పట్టించుకోవడం లేదు కరోనా సందర్భంగా కార్మికులు తన ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల కోసం హాస్పటల్లో కరోనా సందర్భంగా పనిచేశారని కావున వీరిని పర్మినెంట్ కార్మికులుగా గుర్తించి కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రగడ్డ మానసిక వైద్యశాల యూనియన్ కార్యదర్శి ఎన్ సైదయ్య , వైస్ ప్రెసిడెంట్ అలీమ్, శ్రీధర్ ,ఓం ప్రకాష్ ,పి అమేందర్, మల్లేష్, యాసీన్, శ్రీకాంత్ ,తిరుపతి రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.