
సిఐటియు జిల్లా కన్వీనర్ కే చంద్రశేఖర్ఈ రోజు అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని సిఐటియు జిల్లా కన్వీనర్ కే చంద్రశేఖర్ గారిని ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించమంటే ముందస్తు అరెస్టులు చేసి నిర్బంధిస్తుందని ఇది ప్రజాస్వామ్యం విరుద్ధమని పోరాటం చేసే హక్కు ప్రతి మనిషికి ఉంటుందని ముందస్తు అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీ టీచర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.