
హైదరాబాద్ లో అహ్మదియ్య ముస్లిం యువకుల రక్తదాన శిబిరం
అంతర్జాతీయ అహ్మదియ్య ముస్లిం జమాత్ యువకుల ఆధ్వర్యంలో జెనెటిక్ ప్రొడక్ట్స్ చారిటెబుల్ అసోసియేషన్ పంజాగుట్ట డాక్టర్ల సమక్షంలో క్యాన్సర్ బాధితుల సహాయం కోసం రక్తదాన శిబిరాన్ని మస్జిదుల్ హంద్ సైదాబాద్ మసీదులో నిర్వహించడం జరిగింది.ఈ శిబిరంలో 48 మంది రక్తదానం చేశారు.మానవ సేవయే ప్రధాన లక్ష్యంగా కుల మతాలకతీతంగా ఈ సంస్థ నిరంతరం ప్రపంచ వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది.“అందరినీ ప్రేమించు ఎవ్వరిని ద్వేషించకు“ అనే నినాదంతో అహ్మదియ్య ముస్లిం జమాత్ 5వ ఉత్తరాధికారి హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ నాయకత్వములో సర్వ మానవాళినీ ఏకం చేస్తూ సమానత్వాన్ని పెంపొందించే చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది.ఈ కార్యక్రమం లో సంస్థ హైదరాబాద్ అధ్యక్షులు తన్వీర్ అహ్మద్,జిల్లా అధ్యక్షులు హమీదుల్లా హసన్,యువకుల స్థానిక అధ్యక్షులు రాషిద్ అహ్మద్,జిల్లా యువకుల అధ్యక్షులు ఫరీద్ అహ్మద్ ఘోరి,వయోజనుల (వృద్ధుల సమితి)స్థానిక అధ్యక్షులు జియాఉద్ధిన్,జిల్లా అధ్యక్షులు అన్వర్ ఘోరీ,జెనెటిక్ ప్రొడక్ట్స్ చారిటెబుల్ అసోసియేషన్ పంజాగుట్ట డాక్టర్లు శ్రీనివాస్,సుకుమార్,సరితలు పాల్గొన్నారు.