
ఈ69న్యూస్ జనగామ
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గంలోని తిడుగు,తమ్మడపల్లె ఐ,తిమ్మంపేట,జఫర్గడ్ కస్తూరిబాయి గాంధీ విద్యాలయం రాజవరం మరియు జఫర్గడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్టేషన్గన్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేలేరు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు మా హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ద్వారా 650 విద్యార్థులకి ఎగ్జామ్ ప్యాడ్ మరియు టూ పెన్స్ పెన్సిల్ కిట్టు 30 వేల రూపాయలతో జఫర్గడ్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రి డొనేట్ చేయడం జరిగిందని దాతలు పల్లె రాజిరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రిన్స్ పాల్స్,ఉపాద్యాయులు విద్యా కమిటి చైర్మన్ లు ఫౌండేషన్ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.