
106 వసారి రక్తదానం చేసి చిన్నారికి ప్రాణం కాపాడిన లెజెండ్
గుంతకల్లు పట్టణంలో ని ఆర్ టి హాస్పిటల్ నందు 2 సంవత్సరాలు చిన్నారికి బి పాజిటివ్ రక్తం అవసరం అని వైద్యులు చెప్పగా లెజెండ్ బ్లడ్ ఆర్గనైజేషన్ ని సంప్రదించగా లెజెండ్ సలహాదారుడు తిప్పన్నది కూడా బి పాజిటివ్ కావడంతో అతను వెంటనే స్పందించి గోపి బ్లడ్ బ్యాంకుకు వచ్చి రక్తదానం చేశారు సకాలంలో స్పందించిన లెజెండ్ సలహాదారుడు సీనియర్ రక్తదాత తిప్పన్నకి లెజెండ్ బ్లడ్ ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈరోజుతో లెజెండ్ సలహాదారుడు తిప్పన్న 106 వసారి రక్తదానం చేసి తన ఔదార్యంని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో లెజెండ్ అధ్యక్షులు రంజాన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు సహాయ కార్యదర్శి పరశురాం పాల్గొనారు