
15వ ఈశా గ్రామోత్సవ క్రీడా పోటీలు
పామిడిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో 15వ ఈశా గ్రామోత్సవం క్రీడా పోటీలకు ప్రజల క్రీడాకారుల విశేష స్పందనతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పామిడి వాలీబాల్ అసోసియేషన్ అధినేత లక్ష్మీ నారాయణ రెడ్డి,అడ్వకేట్ ఎస్ ఆర్ కే దత్తు,సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు – రమణ,బాబా, పెన్నయ్య,మున్నా , మోడల్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ నరేష్ కుమార్ , కానిస్టేబుల్ దాదా, ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
ఈ గ్రామోత్సవం క్రీడా పోటీలలొ బాగంగ పురుషులకు వాలీబాల్, గ్రామీణ ఆటలు ఇంకా సాంప్రదాయ కళలు గ్రామోత్సవంలో ముఖ్య విభాగాలు. ఈ క్రీడలలో పాల్గొనడానికి అనంతపురం, కర్నూలు, నంద్యాల మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో నుండి 26 వాలీబాల్ జట్లు వచ్చి వారి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు.
అలగే ఆగస్టు 12 ఇంకా 13న తిరుపతిలో, అన్నమయ్య, చిత్తూరు, కృష్ణ, మొదలైన జిల్లాలలో కూడా ఈ పోటీలు జరగనున్నాయి అని నిర్వాహకులు తెలిపారు.