
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని నడిగూడెం మండల తహసీల్దార్ నాగేశ్వరావు గురువారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆక్టోబర్ 01-2023 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ,యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. నామినేషన్లు 10 రోజుల ముందు వరకు గడువు ఉందని,ఈ అవకాశాన్నీ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.