
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తమ్మడపల్లి(జి) గ్రామంలో 20 లక్షలతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల నుండి మంజూరు అయి నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య బుధవారం రాత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు ఆధ్వర్యంలో మరియు సర్పంచ్ అన్నెపు పద్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
పల్లెప్రగతి అనే వినూత్నమైన కార్యక్రమం ప్రవేశపెట్టి పల్లెప్రగతి ద్వారా రాష్ట్రంలో ఉన్న 12769 గ్రామపంచాయతీలకు నెలకు తలకోకంటికి1632రూపాయల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు 256 కోట్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గ్రామానికి ఒక నర్సరీ,ఒక వైకుంఠదామం,ఒక పల్లెప్రకృతి వనం,ఒక సెగ్రీగేషన్ షేడ్,ఒక డంపింగ్ యార్డు,ఒక క్రీడా ప్రాంగణం వంటి మౌళిక సదుపాయాలతో పాటు ఒక ట్రాక్టర్,ట్రాలీ మరియు ట్యాంకర్ వంటి సదుపాయాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.ఇవే కాక రైతును రాజును చేయడానికి రైతుబంధు ద్వారా సంవత్సరానికి ఎకరానికి 10వేల రూపాయలు పెట్టుబడి సాయం చేయడం గుంట భూమి ఉన్న రైతు చనిపోయిన కూడా ఐదు లక్షల రైతుబీమా 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు,కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డలకు పెళ్లికానుకగా 1లక్ష116,కెసిఆర్ కిట్టు,అమ్మాయి పుడితే 13వేలు అబ్బాయి పుడితే 12వేలు ఇవ్వడమైతేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే శుద్ధికరణ చేసిన మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు దళితులకు దళితబంధు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజాహిత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్1 స్థానంలో నిలిచిందని అన్నారు.75 గజాల సొంత ఇంటి స్థలం ఉన్నట్లయితే అట్టి వారందరికీ మూడు లక్షల రూపాయల ప్రభుత్వ సహాయం అందించే ఇండ్ల పథకాన్ని మహిళల పేరుమీద ఇస్తానని తెలిపారు.అదేవిధంగా దళితుల సమగ్ర అభివృద్ధి కోసం తీసుకువచ్చిన దళితబంధు పథకాన్ని వంతుల వారిగా,విడుతల వారీగా నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేయబడుతున్నాయని అన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అక్షయ పాత్ర లెక్క ఏది అడిగితే అది ఇచ్చే విధంగా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు, సంబంధిత శాఖల అధికారులు,గ్రామ ప్రజలు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.