ఈ69న్యూస్ జఫర్ఘడ్ డిసెంబర్ 05 హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో దాతలు రేవూరి సంతోష్ రెడ్డి ఆర్థిక సహాయంతో జఫర్గడ్ మండలంలోని కూనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 20 మంది విద్యార్థిని విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ పరీక్ష సామాగ్రిని అంద చేయడం జరిగింది.ఈ పాఠశాలను గత ఐదు సంవత్సరాల నుండి పల్లె రాజిరెడ్డి ఆధ్వర్యంలో దత్తత తీసుకొని కనీస అవసరాలను తీర్చడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పల్లె రాజి రెడ్డి గాదెపాక భాస్కర్ చల్ల కుమారస్వామి ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.