పాలడుగు భాస్కర్ – CITU
కేంద్ర బిజెపి ప్రభుత్వ హయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసమైనాయని దీనివల్ల దేశ ఆర్ధిక సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లందని ఈ క్లిష్ట పరిస్థితుల్లో 2024 ఫిబ్రవరి 16 కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల గ్రామీణ బంద్- కార్మిక సమ్మెను విజయవంతం చెయ్యాలని 2024 జనవరి 21న హైదరాబాద్‌లో జరిగిన సిపిఎసు రాష్ట్ర సదస్సులో పాలడుగు భాస్కర్ (సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) పిలుపునిచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయంతో పాటు ప్రభుత్వరంగ సంస్థల భూములను మోడీ సర్కార్ అమ్మకాలకు పెట్టడం అన్యాయమని విమర్శించారు. బిజెపి తొమ్మిదేళ్ళ పాలనలో ప్రభుత్వరంగ సంస్థల ధ్వంసానికి పాల్పడిందని ఈ పరిస్థితుల్లో 2024 ఫిబ్రవరి 16 దేశవ్యాప్త కార్మికుల సమ్మెను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు సమ్మె బాట పట్టి ప్రైవేటీకరణ విధానాలను ప్రతిఘటించాలని కోరారు.
ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్, సిపిఎసు నాయకులు జె. రాఘవరావు, ఎ. భాస్కరావు, యాదగిరి, టి. సత్తయ్య, శ్రీధర్, సుందర్రాజన్, నర్సింగ్‌రావు, పెంటయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.