22 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర
టేకుమట్ల మండల కేంద్రంలోని ఎం ఆర్ సి భవనంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన భూపాలపల్లి శాసన సభా సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి,ఈ కార్యక్రమంలో 22 మంది లబ్ధిదారులకు దాదాపు 22 లక్షల రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధి దారులకు పంపిణీ చేశారు.అనంతరం రేపు భూపాలపల్లి లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్ గా ఒక్కేసారి 9 మెడికల్ కళాశాలను ప్రారంభిస్తున్న సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృజ్ఞతలు తెలుపుతూ భూపాలపల్లి హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా టేకుమట్ల మండలం నుండి అధిక సంఖ్యలో రావాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు