
nadigudem - Latest News in Telugu, Photos,
పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.
తెలంగాణ ప్రాంతంలో నాడు నిజాం సైన్యాన్ని రజాకార్లను జమీందారుల గుండాలను తరిమి కొట్టింది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన తెలంగాణ సాయుధ పోరాటమేనని 230 సంవత్సరాల అసఫ్జాహీ నరహంతక దోపిడీదారుల నుండి ప్రజలని విముక్తి చేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈబుదవారం రోజు అన్నేపర్తి గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కోటగిరి ఈశ్వరయ్య చిత్రపటానికి పూలమాలంకరణ చేసి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నిజాం సైన్యం హిందూ జమీందారులు రజాకారులు కలిసి హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ప్రజలను దోపిడీ చేశారని వ్యక్తి చాకిరికి గురి చేశారని అన్నారు. తన పంట పొలంలోని ధాన్యాన్ని విసునూరు దేశముఖ రామచంద్రారెడ్డి గుండాలు కలిసి అక్రమంగా ఎత్తుకు పోతుంటే ఎదిరించి చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం చేసిందని దానితో ప్రజలు ఉత్సాహంగా 300 గ్రామాలలో నిజాం కు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. అదే ఉత్సాహంతో గ్రామాలలో ఊరేగింపు జరుగుతున్న సందర్భంగా దొడ్డి కొమరయ్యను నిజాం సైన్యం రజాకాల్లో కాల్చి చంపారని దానితో ప్రజలు తిరగబడి దొరల గడీలు బద్దలు కొట్టారని అన్నారు. మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో మట్టి మనుషులు చేసిన పోరాటమని సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పోరాటమని అన్నారు. బిజెపి ఇతర పార్టీలు తెలంగాణ సాయుధ పోరాటం లో పాల్గొనలేదని అన్నారు. కమ్యూనిస్టుల స్వచ్ఛమైన పోరాటాన్ని మలినం చేసేందుకు హిందూ ముస్లిం రంగు పులుముతున్నారని నిజాం ముస్లిం కాబట్టి హిందూ ఐక్యం కావాలని బిజెపి అంటుందని ఇది శుద్ధ తప్పు అన్నారు. హిందూ దేశముకులు నిజాము సైన్యం రజాకార్లు కలిసి హిందూ ముస్లిం తేడా లేకుండా దోపిడీ చేశారని అన్నారు. సాయుధ తెలంగాణ పోరాటంలో కులం మతం ప్రాంతం హిందూ ముస్లిం అని తేడా లేకుండా ఉద్యమించారని అన్నారు. సాయుధ పోరాటంలో అసువులు బాసిన అమరులందరినీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంది పోయేలా చిత్రపటాలను స్థూపాలను పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నలుపరాజు సైదులు మండల కమిటీ సభ్యులు బొల్లు రవీందర్ కుమార్ నాయకులు తోటకూరి నరేందర్ సోమా అండాలు కొండూరు స్వామి అమరవాజీ దేవేందర్ మట్టపల్లి సైదులు కొండూరు లక్ష్మమ్మ నరాముల సైదులు తోటకూరి ధనమ్మ శంకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.