ఈ69న్యూస్ ఘనపూర్,జూలై 24 జూలై 26న పాలకుర్తి లో జరగనున్న మత్స్య కార్మిక సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలనే పిలుపుతో,గురువారం ఘనపూర్ మండల కేంద్రంలోని స్థానిక సొసైటీ కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగెల రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించారు.ఆయన మాట్లాడుతూ..మత్స్య కార్మికుల హక్కుల కోసం జరుగుతున్న ఈ మహాసభలు చారిత్రాత్మకంగా నిలవాల్సిన అవసరం ఉంది.అందుకే ప్రతి కార్మికుడు పాల్గొని సంఘ బలోపేతానికి తోడ్పాటునివ్వాలి అని కోరారు.మండల అధ్యక్షులు గోనెల వెంకన్న,మండల కార్యదర్శి లింగనబోయిన రాజు,నాయకులు లింగనబోయిన కుమారస్వామి,గోనెల చందు,మునిగెల కుమారస్వామి తదితరులు పాల్గొని మహాసభల ప్రాధాన్యతను వివరించారు.