2nd ANMలను రెగ్యులర్ చేయాలి-సీతక్క
ANM ల నిరువధిక సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో తపాలా కార్యాలయం ఎదుట CITU ఆధ్వర్యములో గత రెండు రోజులుగా ANM లను పర్మినెంట్ చేయాలని కోరుతూ చేస్తున్న నిరువధిక సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.  ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మాట్లాడుతూ నోటిఫికేషన్ నెం. 02/2023ను క్యాన్సిల్ చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎంపిహెచ్ (ఫిమేల్)ల సర్వీసులను క్రమబద్ధీకరించాలి,11వ పి.ఆర్.సి. ప్రకారం కనీస వేతనం (బేసిక్) రూ.31,040/-లతో బాటు డి.ఏ., హెచ్.ఆర్.ఏ. ఇతర అలవెన్సులు ఇవ్వాలి. పెండింగ్ ఎరియర్స్ వెంటనే ఇవ్వాలి. వ్యాక్సిన్ అలవెన్స్ 500 రూపాయలతో పాటు యూనిఫాం అలవెన్స్2,500 ఇవ్వాలనీ 4. 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నటీ లీవులు, మెడికల్ లీవులు ఇవ్వాలి.నైట్ డ్యూటీలు, ఓ.పి. డ్యూటీలు రద్దు చేసి బదిలీకి అవకాశం కల్పించాలి. విధి నిర్వహణలో చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వడం తో పాటు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి.ఫీల్డ్ డ్యూటీ చేస్తున్నందున ఎఫ్.టి.ఏ. సౌకర్యం కల్పించాలని ANM లకు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్
కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, CITU జిల్లా నాయకులు రత్నం రాజేందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వేంకటా పూర్ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్
ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి, ములుగు పట్టణ అధ్యక్షులు చింత నిప్పుల భిక్ష పతి,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు,బీసీ సెల్ మండల అధ్యక్షులు రవి యాదవ్,మండలఉపాధ్యక్షులు ఆర్శం రఘు,కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గుంటోజు శంకరయ్య,గ్రామ కమిటీ అధ్యక్షులు గుండ భిక్షపతి,ఓరుగంటి అనీల్ తదితరులు ఉన్నారు.