30 మంది దివ్యాంగులకు నిత్యవసర సరుకులు వితరణ
Khammamతల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు బెల్లంకొండ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈరోజు వారి ఇద్దరి పిల్లలు మహేష్ కుమార్ మనోజ్ కుమార్ జన్మదినోత్సవం సందర్భంగా కేకు కట్ చేసి తల్లాడ మండలంలో గల 30 మంది దివ్యాంగులకు నిత్యవసర సరుకులు వితరణ. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ మా ఇద్దరి పిల్లల పుట్టినరోజు ఒకే తారీకు రావటం మూలంగా ఈరోజు తల్లాడ మండలంలో గల దివ్యాంగుల అధ్యక్షులు ఎం కృష్ణ తో నెలరోజుల క్రితం అతనితో మాట్లాడి అందరినీ సమకూర్చి ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు కృష్ణకు ధన్యవాదములు. దివ్యాంగులు అందరూకు దేవుడి పెట్టిన శాపం ఎవరు కావాలని చేసుకున్నది కాదు అయినా మీరు మా అందరితో సమానం మా పిల్లలు ఇద్దరు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈసారి దివ్యాంగులకు నిత్య నిత్యవసర సరుకులు ఇస్తే వాళ్ళు సంతోషంగా ఒక నెల కు సరిపోతాయని వారు చెప్పటం మూలంగా నేను ఈరోజు మీకు ప్రతి ఒక్కరి సరుకులు ఇవ్వడం జరిగింది. మా ఆతిథ్యా న్ని మన్నించి వచ్చినందుకు గాను మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో డిసి పులబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈరోజు మా అధ్యక్షులు వారి ఇద్దరు కుమారుల , మహేష్ కుమార్, మనోజ్ కుమార్ లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 30 మంది దివ్యాంగులకు నిత్యవసర సరుకులు ఇవ్వడం అభినందనీయం మీరందరూ కూడా అధ్యక్షులు వారి పిల్లలకు జన్మదిన శుభాకాంక్షలు మరియు వారు మంచి జాబ్ లో సెటిలై మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించగలరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలభారతి కరస్పాండెంట్ కోటగిరి ప్రవీణ్ గారు మాట్లాడుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకునే ఇద్దరు మా స్కూల్లో చదువుకున్న పిల్లలే వారిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్కూల్లో ఈ ప్రోగ్రాంకు అటెండ్ అయిన దివ్యాంగులందరికీ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు వేమిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇద్దరు పిల్లలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ కటిక వెంకటేశ్వరరావు, ట్రెజరర్ శీలం వెంకటరెడ్డి, సీనియర్ సభ్యులు దగ్గుల నారాయణరెడ్డి ,దగ్గుల ప్రభాకర్ రెడ్డి , సింగరి కొండ సతీష్, చిట్టెం నరసింహారావు, వేమిరెడ్డి సీతారాంరెడ్డి, కోడూరు నాగేశ్వరరావు, చాపల నరసింహారావు, బాలభారతి స్కూల్ స్టాప్, గ్రామ ప్రజలు మొదలగువారు పాల్గొన్నారు.