- USFI సిద్దిపేట జిల్లా కార్యదర్శి చంద్లాపురం మధు
*సంక్షేమ హాస్టళ్లల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచుతారా లేక కాంగ్రెస్ MLA ల ఇళ్లకు తిననికి రమ్మంటారా..?
– USFI సిద్దిపేట జిల్లా కార్యదర్శి చంద్లాపురం మధు
భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (USFI) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఉన్న వివిధ ప్రీ మెట్రిక్ సంక్షేమ హాస్టల్ లను సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థులు మరియు వార్డెన్ లతో మాట్లాడి హాస్టళ్లలో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా USFI సిద్దిపేట జిల్లా కార్యదర్శి చంధ్లాపురం మధు మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్ళల్లో పదవ తరగతి వరకూ చదువుకునే విద్యార్థులకు ఒక రోజుకు 33 రూపాయలు అలాగే ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఒక రోజుకు 50 రూపాయలు తినడానికి మెస్ బిల్లుల రూపాన ప్రభుత్వం అందిస్తుంది, ఇంత తక్కువ మెస్ బిల్లులతో విద్యార్థులు ఏ విధమైన పోషకాహారాన్ని తీసుకోగలరు సీఎం గారు మీరే ఒక్కసారి ఆలోచించాలి, ఒక పూట ఎమ్మెల్యే తినే భోజనం ఖర్చంత కూడా సంక్షేమ హాస్టల్ విద్యార్థులు మూడు పుట్ల తినడానికి ప్రభుత్వం ఖర్చు చేయట్లేదు. కనీసం పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక రోజుకు 250 రూపాయలకు మెస్ బిల్లులను పెంచాలి. అలాగే పదవ తరగతి వరకు చదువుతున్న సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నెలకు 62 రూపాయలు అలాగే ఆపై తరగతులు చదువుతున్న వారికి నెలకు 500 రూపాయలు పాకెట్ మనీ ఇవ్వాల్సి ఉండగా చాలా సంవత్సరాల నుండి వాటిని ఇవ్వడం లేదు. ఒక విద్యార్థి 12 రూపాయలతో హేర్ కటింగ్ చేసుకోవడం ఎలా సాధ్యమో మీరే చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం కనీసం ఒక హాస్టల్ నిర్వహణకు 20వేల రూపాయలు మెయింటెనెన్స్ బిల్లు కింద ఇవ్వాల్సి ఉండగా కొన్ని సంవత్సరాల నుండి ఒక్క రూపాయి కూడా రావడం లేదు, దీనివల్ల హాస్టళ్ళల్లో డోర్లు లేని బాత్రూంలు, కిటికీలకు డొర్లు లేని గదులు, పెచ్చులూడిన రూములలో, ఫ్యాన్లు పనిచేయని గదులల్లో దోమ కాటులతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. నేటి బాలలకు సరైన సౌకర్యాలు అందించకుంటే రేపటి రోజున ఇదే పౌరులు బలహీనంగా మారి అనారోగ్యాల పాలవుతూ ఈ దేశానికి ఒక బలమైన వెన్నుముకగా ఎలా ఉండగలుగుతారు అని అన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ఒక సంవత్సరానికి రావలసినటువంటి ట్రంకు పెట్టె, ప్లేటు, గ్లాసు, కటోర, రెండు రకాల షూ, బెడ్డింగ్ మెటీరియల్, నోట్ బుక్స్ ,ఎగ్జామ్ మెటీరియల్స్ , మంకీ క్యాప్స్, స్వెటర్లు, SSC ఆల్ ఇన్ వన్ మెటీరియల్ , నాలుగు జతల యూనిఫామ్స్, అలంకరణ సామాగ్రి, స్కూల్ బ్యాగ్, దోమతెరలు ఇలా వేటిని కూడా సరియైన సమయంలో అందించకుండా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు వాటిని అందించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు. కనీసం హాస్టల్ కు ఒక స్కావెంజర్ ను కూడా ఇవ్వలేకపోవడం వల్ల హాస్టల్లో శౌచాలయాలు అద్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించాల్సిన బడ్జెట్ ను 30 శాతానికి తగ్గకుండా కేటాయించాలని, అందులోనూ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, జిల్లా అధికారులను అన్ని సంక్షేమ హాస్టల్ లను సందర్శించి వాటిలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. లేని పక్షంలో వేలాదిమంది సంక్షేమ హాస్టల్ విద్యార్థులతో స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించి వారి ఇళ్లల్లోనే మూడు పూటలా తిననికి తిష్ట వేసి కూర్చుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నాయకులు రవి, వినయ్, మహేష్ ,శ్రావణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు…