34వ రోజు మూడో విడత ఇందిరమ్మ ఇండ్ల రిలే నిరాహార దీక్షలు
జనగామ పట్టణంలోని ఇందిరమ్మ 3డవ విడత లబ్ధిదారులు గత 34రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదు వెంటనే ఎమ్మెల్యే గారు నిరుపేదల గురించి ఆలోచన చేసి వారిని పట్టించుకోవాలని, వారికి పట్టాలు ఇవ్వాలని 3డవ విడత ఇందిరమ్మ కాలనీ అధ్యక్షులు కళ్యాణం లింగం డిమాండ్ చేశారు.
చిట్యాల ఐలమ్మ నగర్ డబల్ బెడ్రూమ్ ల వద్ద మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల రిలే నిరాహార దీక్షలు హాలియా 34వ రోజు దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే పేరుతో కాలయాపన చేస్తూ గత కాంగ్రెస్ ప్రభుత్వం 2012 -13 సంవత్సరంలో మూడో విడత ఇందిరమ్మ పథకం ద్వారా పట్టాలిచ్చి స్థలాలు చూపించడం మరిచారని నేటి తెలంగాణ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన వాళ్లకు 6 నెలల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని వాగ్దానం చేసి నేటికీ ఐదు సంవత్సరాలు కావస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం పేదల పట్ల జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి చిత్తశుద్ధి లేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిని ఇదే సందర్భంలో సర్వే చేయడం మోసం చేయడమే అన్నారు. ఇప్పటికైనా జిల్లా స్థానిక ఎమ్మెల్యే వెంటనే మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పిట్టల శారద, ఎర్ర రజిత, పాముకుంట్ల చందు, పొన్నాల ఉమా, గండ్ర చంద్రశేఖర్, మచ్చ వరలక్ష్మి, కూకట్ల యాకయ్య, కత్తి మల్లమ్మ, బాల్దె స్వరూప, ఎన్. రాజు, పి. పద్మ, ఎండి. సంరిన్, ఎం.శ్రామిక తదితరులు పాల్గొన్నారు.