
కాంగ్రెస్ భవన్ – 04-12-2022..
నేడు (05-12-2022) రైతు, వ్యవసాయ & భూమి సమస్యలను నిరసిస్తూ హన్మకొండ &వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బాలసముద్రం ఏకశిలా పార్క్ వద్ద ధర్నా..
టిపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ధర్నాలో భాగంగా హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రేపు (05-12-2022) ఉదయం 10.30 గంటలకు హన్మకొండ ఏకశిలా పార్క్, బాలసముద్రం వద్ద రైతు, వ్యవసాయ & భూమి సమస్యలపై ధర్నా కార్యక్రమం నిర్వహింఛడం జరుగుతుందని అనంతరం హన్మకొండ & వరంగల్ జిల్లా కలేక్టర్లకి గారికి వినతిపత్రం సమర్పించడం జరుగుతుందని కావున జిల్లా, నగర కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, మండల/బ్లాక్/డివిజన్ అద్యక్షులు & కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయగలరని హన్మకొండ & వరంగల్ జిలా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.