*50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన శివునిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి కుర్ర చిరంజీవి* స్టేషన్ ఘన్ పూర్ మార్చి 02 సిసి రోడ్డు నిర్మాణ పనుల బిల్లు చెల్లింపు కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ కుర్ర చిరంజీవి అనే పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కిన ఘటన గురువారం శివుని పల్లి లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం శివునిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను చిల్పూర్ మండలం పల్లగుట్టకు చెందిన శివరాత్రి కొమురయ్య పూర్తి చేశాడు.పూర్తి చేసిన పనులకు బిల్లు చెల్లించాలని కోరగా పంచాయతీ కార్యదర్శి రూ. 1 లక్ష 20 వేలు లంచం అడిగాడు. మొదట రూ.15 వేలు ఇచ్చిన కొమురయ్య ఎం బి రికార్డు చేసి బిల్లు చెల్లించమని కార్యదర్శి చుట్టూ నెలల తరబడి తిరిగిన ఫలితం లేకుండా పోయింది. దీంతో విసుగు చెందిన కొమురయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పథకం ప్రకారం గురువారం రోజువారి విధులకు వచ్చిన పంచాయతీ కార్యదర్శి కాంట్రాక్టర్ కొమురయ్య వద్ద రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.