
5000 మందితో ఎర్రదండు కవాతు
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభ సందర్భంగా 29న జరిగే బహిరంగ సభలో 5000 మంది యువకులతో ఎర్ర దండు కవాతు చేయనున్నట్లు, ఈ కవాతుకు యువతీ యువకులు కదిలి రావాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ పిలుపునిచ్చారు…
స్థానిక మంచి కంటే భవనంలో రెడ్ షర్ట్ వాలంటీర్స్ కు శిక్షణ ఇచ్చే కమాండర్‌కు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ గారి అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా వచ్చిన బండి రమేష్ మాట్లాడుతూ ఈనెల 29వ తారీఖున జరిగే బహిరంగ సభకు ముందు పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఎస్ ఆర్ అండ్ బిజీ అన్నారు గ్రౌండ్ వరకు ఎర్రదండు కవాతు ఉంటుందని , ఈ కవాతులో జిల్లా మొత్తం నుంచి 5000 మంది యువతీ యువకులు పాల్గొంటారని ఆయన సందర్భంగా తెలియజేశారు. ఈ ఎర్రగడ్డ కవాతులో పాల్గొనేందుకు యువతీ యువకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు బుక్కా వీరభద్రం, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ లు మాట్లాడుతూ గ్రామ గ్రామాన కవాతు శిక్షణ ఇచ్చేందుకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ముఖ్యులకు శిక్షణ ఇవ్వటం జరిగిందని వారు తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా ఐదువేల మందికి శిక్షణ ఇవ్వబోతున్నట్లు , ఈ ఐదు వేల మందితో 29వ తారీఖున కవార్డు చేయునట్లు వారి సందర్భంగా తెలియజేశారు. ఈ కవతులో యువతి యువకులు పాల్గొనాలి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుదర్శన్ రెడ్డి, పొన్నగంటి సంగయ్య, గుగులోతు నరేష్, భూక్య కృష్ణ, డివైఎఫ్ఐ నాయకులు చింతల రమేష్, సత్తెనపల్లి నరేష్, పటాన్ రోషిని కాన్, కూరపాటి శ్రీను, శీలం వీరబాబు, కనపర్తి గిరి, పొన్న మురళి,పాషా, శభాష్ రెడ్డి, సారంగి పాపారావు, ఎర్ర సాయి, రావులపాటి నాగరాజు, శ్రీకాంత్, సాయి, ప్రసాద్ లతో పాటుగా మరో వంద మంది పాల్గొన్నారు.