
telugu galam news e69news local news daily news today news
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రక్కన దళితుల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కోళ్ల ఫారాల వద్ద జాతీయ జెండాను కలకోల యాదగిరి ఎగురవేశారు.అనంతరం వారు మాట్లాడుతూ..రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం 1987లో దళితుల కోసం పల్లగుట్ట గ్రామం వద్ద భూములు కేటాయించి కోళ్ల ఫారంలు సాంక్షన్ చేయడం జరిగిందని ఆ తర్వాత వచ్చిన టిడిపి ప్రభుత్వం దానికి సరైన నిధులు కేటాయించక పోవడంతో కోళ్ల ఫారంలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.పలుమార్లు మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకు కలిసి చెప్పుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనము చేకూరలేదు పైగా ఈ భూములను ఆక్రమించుకోవాలని కొంతమంది భూస్వాములు ప్రయత్నించినప్పటికీ వాటిని కాపాడుతూ గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా మా గోడును విని మాకు న్యాయం జరిగేలా చూడాలి అని ఉపాధిని కల్పించాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో సింగాపురం మోహన్, రాజారపు వినయ్,మరపాక ప్రవేశ్,ఆరూరి వెంకటేష్,చింత లక్ష్మి నారాయణ,బలిజ చంద్రయ్య,రాదపాక లీంగయ్య,ఐలపాక జేమిస్ తదితరులు పాల్గొన్నారు.