
75 వ వారికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర
ఏనుమాముల మార్కెట్ లో వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరంగల్ ఛాంబర్ కామర్స్ 75వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గోన్న భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి . ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు. అనంతరం వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డిని శాలువాతో సత్కరించారు.