
telugu galam news e69news local news daily news today news
వరంగల్ పట్టణ కేంద్రంలోని ఆటోనగర్ ప్రాంతంలో గల లూయిస్ అంధుల ఆశ్రమ పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యూత్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ మిషనరీ ఇంచార్జి మౌల్వీ అయాన్ అహ్మద్ పాషా మాట్లాడుతూ..దేశాన్ని ప్రేమించడం ఇస్లాంలో ఒక భాగమని భారతీయులందరూ స్వదేశం పట్ల ప్రేమ కలిగి ఉండాలని అన్నారు.అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యూత్ శాఖ ఆధ్వర్యంలో యావత్ భారత్ దేశంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ముహమ్మద్ సలీం,ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు అహ్మద్ పాషా,పట్టణ యూత్ అధ్యక్షుడు కబీర్ పాష,రఫీ,కరీం,తదితరులు పాల్గొన్నారు.