8 వ రోజుకు చేరిన మిత్రా సుజుకి ఉద్యోగుల సమ్మె
డెడ్ లైన్ ప్రకటించిన సీఐటీయూ నేత పెరుమాళ్ళపల్లి ఖమ్మం రూరల్ మండలంలో జరుగుతున్న
మిత్రా సుజుకి అండ్ పరమషివ షోరూం ఉద్యోగ కార్మికుల నిరవధిక ఆందోళన మంగళవారంతో ఎనిమిదోవ రోజుకు చేరింది.
ఎనిమిదోవ రోజు నిరవధిక ఆందోళన శిబిరాన్ని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పెరుమాళ్ళపల్లి మోహన్ రావు ప్రారంభించి మాట్లాడుతూ షోరూం యాజమాన్యం పట్టుదలకు వెళ్ళకుండా ఉద్యోగులు కార్మికులు వారి సంఘాల నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని వారికి రావాల్సిన బోనస్,ఇన్సెంటివ్స్ గత ఆరు నెలలుగా తగ్గించిన వేతనాలు, ఉద్యోగులు కార్మికుల నుండి కట్ చేసి యాజమాన్యం వాటా పియఫ్ చెల్లించకుండా యాజమాన్యం దగ్గర వుంచుకొని పియఫ్ చెల్లించలేదని ఆరోపించారు. వాటిని వెంటనే చెల్లించాలని గత ఇరవై సంవత్సరాలుగా షోరూంలలో పనిచేస్తున్న వారందరికీ గ్రాడ్యూటి అన్ని షోరూం యాజమాన్యంలు ఇవ్వాల్సిన పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.షోరూం ని ఉద్యోగులు కార్మికులు ముందుగా చెప్పకుండా ఉన్న పలంగా మూత పెడితే ఉద్యోగులు కార్మికులు రోడ్డున పడతారని
వారందరికీ 140 మంది కి ఆరు నెలలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.యాజమాన్యానికి రెండు రోజులు గడువు ఇస్తున్నామని ఈ రెండు రోజుల్లో యాజమాన్యం సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో ఆ తర్వాత జరిగే పరిణామాలకు యాజమాన్యం బాధ్యత వహించాలని హెచ్చరించారు.
ఆందోళనలో: నాగ శ్రీనివాసరావు,రాందేవ్, వెంకటేశ్వరరావు,రవి, జాహ్నవి, క్రిష్ణ, నవీన్,రజిత, నర్సింహారావు, ప్రసాద్, మీరా, శుక్రుపాష, ప్రకాష్, ప్రవీణ్, వీరబాబు,ఉపేంద్రచారి,నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎనిమిదోవ రోజు ఆందోళనకు సిఐటియు అనుబంధ సంఘాలు అంగన్వాడీ,ఆషా వర్కర్స్, బిల్డింగ్ వర్కర్స్ నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపి తమ సంఘీభావం ప్రకటించారు.
వారిలో పుష్పరాణి,రమణి, వెంకటమ్మ,సునీత,సుజాత, శ్రీనివాసరావు,నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.