డిసెంబర్ 26న భారీ భహిరంగ సభ ను జయప్రదం చేయండి
(Nprd రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ పిలుపు.)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గం గెలుపుకోసం అక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపిస్తూ, ఎనలేని ప్రేమను చూపించి నెల దాటినా ఇంకా వికలాంగుల పింఛన్ దారులకు పింఛన్ పంపిణి చేయలేదని, ఇప్పటికి మూడు నెలల పింఛన్ డబ్బులను ప్రభుత్వం వద్దనే ఉంచుకొని పింఛన్ ఇవ్వకుండా హరిగోసలకు గురిచేస్తూన్నారని, తక్షణమే పింఛన్ డబ్బులు పంపిణి చేయాలని, దీనితోపాటు పెండింగ్ డబ్బులను విడుదల చేయాలని ఎన్పిఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దివి: 01-12-2022 గురువారం రోజున ఎన్పిఆర్డీ జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు ఆధ్వర్యంలో ఎన్పిఆర్డీ అఖిల భారత 3వ మహాసభల వాల్ పోస్టర్ ను జనగామ పట్టణంలోని 11వ వార్డు మాజీ కౌన్సిలర్, జరసం జిల్లా నాయకులు ఆకుల వేణు గారితో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ పాల్గొని మాట్లాడుతూ ప్రతినెల పింఛన్ డబ్బులు సక్రమంగా పంపిణి చేయకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపారు. చాలా వికలాంగుల కుటుంబాలు పింఛన్ డబ్బులపై ఆధారపడిన బ్రతుకుతున్నారని అన్నారు. రోజురోజుకి నిత్యావసర సరకుల ధరలు పెరగడం, నెలనెలా ఆరోగ్య సమస్యలకై మందులు, ఇంటి అద్దె ఇలా అనేక సమస్యలు పింఛన్ తో ముడిపడడంతో పింఛనుదారులు అనేక ఇబ్బందులు ఎదురుకొంటున్నారని విమర్శించారు. మునుగోడు ఎన్నికలే ఆసరా పింఛన్ దారుల పంపిణీ డబ్బులకు ఆటంకంగా మారిందని తెలిపారు. ఎన్నికలొస్తే కొత్త పింఛన్లు, కొత్త పథకాలు వస్తాయనుకుంటే ఉన్న పింఛన్ల పంపిణీకి అడ్డంకిగా మారిందని హెద్దేవా చేశారు. ఇప్పటికే 3 నెలల పింఛన్ డబ్బులు ప్రభుత్వం పైనే ఉంటున్నాయని, ఈ నెలతో 3 నెలల పింఛన్ డబ్బులను పంపిణి చేయకుండా ఉండడంతో పింఛన్ దారులలో మునుగోడు ఎన్నికల కోసం ప్రభుత్వం పింఛన్ డబ్బులను ఖర్చులు చేసిందని, అందుకే పింఛన్ లేటుకు కారణం అని విమర్శించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో 2022 ఆగస్టు నుంచే కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పి ఇచ్చినట్టే ఇచ్చి ఒక నెల మాత్రమే పింఛన్లు పంపిణి చేసి, కొత్త పింఛన్ దారులలో జీ.వో.నంబర్ 17తో రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష పింఛన్లను తొలగించడం దుర్మార్గం అన్నారు. జీ.వో 17 సాకుతో వికలాంగుల పింఛన్లను తొలగిస్తే ఊరుకోమని తెలిపారు. ప్రభుత్వం ప్రతినెల వికలాంగులకు పింఛన్లు ఇవ్వకుండా ఏ నెల పింఛన్ డబ్బులు ఇస్తున్నారో పింఛన్ దారులకే అర్ధం కాకుండా పింఛన్లు ఇస్తున్నారన్నారు. 3 నెలల ఆసరా పింఛన్ బకాయి డబ్బులను పింఛన్ దారులకు ఇవ్వకుండా, రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తే నియోజకవర్గాలకు పింఛన్ నిధులను తరలిస్తున్నారనే సందేహం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతినెలా రెగ్యులర్ గా పింఛన్ పంపిణి చేయాలని, 3 నెలల పింఛన్ పెండింగ్ నిధులను విడుదల చేసి పంపిణి చేయాలని డిమాండ్ చేశారు. పింఛన్ దారులను ఇబ్బందులకు గురిచేస్తే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతారని అన్నారు. డిసెంబర్ 26న ఎన్పిఆర్డీ అఖిల భారత మహాసభల సందర్బంగా భారీ బహిరంగ సభ ఉంటుంది, డిసెంబర్ 27, 28 న ప్రతినిధులతో మహాసభలు జరుగుతాయని అన్నారు. ఈ మహాసభలలో ఇతర రాష్ట్రాలలో, మన రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు, స్థితిగతులను చర్చించి భవిష్యత్ పోరాటాల ప్రణాళికను రూపకల్పన చేస్తామని తెలిపారు. వికలాంగులు బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బండవరం శ్రీదేవి, మాలోత్ రాజ్ కుమార్, రావుల శ్రీనివాస్, ఎం.డి. అన్వర్, నాచు అరుణ, చిందాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.