
ఈ69న్యూస్ ఐనవోలు
హన్మకొండ జిల్లా ఐయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు అర్చక,సిబ్బంది నిరసనకు దిగారు.ఆలయంలో కొబ్బరి ముక్కలు సేకరించుకును టెండర్ దారు ఐనవోలు మండలం కేంద్రానికి చెందిన గుండె లావణ్య భర్త యాదగిరి అర్చక,సిబ్బంది విధులకు ఆటంకాలు కలిగిస్తూ,దేవాలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడని,భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడంటూ సదరు వ్యక్తి లైసెన్స్ రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆలయం ముందు రాస్తా రోకో ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ఆర్చక సిబ్బంది పాల్గొన్నారు.