
ఈ69న్యూస్ జనగామ
తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఎండిన పంటలకు ప్రతి ఎకరాకు ఏమ్యూరేషన్ చేసి 50వేల నష్టపరిహారం ఇవ్వాలని దేవాదుల ప్రాజెక్టు నుండి వరద కాలువల ద్వారా జిల్లాలోని చెరువు కుంటలు నింపి రైతుల పంటలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3వ తేదీన ఆర్డీవో కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ పిలుపునిచ్చారు.తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య అధ్యక్షతన ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ…జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాలలో ఎండిపోతున్న రైతుల పంటలను
ఏమ్యురేషన్ చేసి ప్రతి ఎకరాకు 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని అదేవిధంగా జనగామ జిల్లా లో దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరద కాలువల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలను నింపి రైతుల పంటలను కాపాడాలని అదేవిధంగా జిల్లావ్యాప్తంగా కాలువల కోసం భూసేకరణ చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వాటిని పూర్తి చేయకపోవడం వలన రైతాంగానికి రెండు విధాలుగా నష్టం జరుగుతున్నదని కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కాలువలను పూర్తి చేయాలని అదేవిధంగా గ్రామాలలో తాగునీటి అవసరాల కోసం నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలువల ద్వారా చెరువులు కుంటలు నింపాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల సారయ్య మంగ బీరయ్య జిల్లా సహాయ కార్యదర్శి రమావత్ మీట్యా నాయక్ జిల్లా కమిటీ సభ్యులు ఎడబోయిన రవీందర్ రెడ్డి రాజవ్వ, నక్క యాకయ్య లింగబోయిన కుమారస్వామి సమ్మయ్య పురుషుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.