
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతికలుగా నిలుస్తాయని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.రంజాన్ పండుగను పురస్కరించుకొని స్టేషన్ ఘనపూర్ లోని ఈ.ఆర్.ఎల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ మరియు రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే గొప్ప పండుగ రంజాన్ పండుగ అని తెలిపారు.ఈ నెల రోజులు ఉపవాస దీక్షలు చేపట్టిన ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని అల్లాను ప్రార్థించారు.ముస్లిం సోదరులు ఆర్థికంగా,రాజకీయంగా,సామాజికంగా,విద్యా పరంగా వెనుకబడి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించేందుకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసి నాణ్యమైన భోజన వసతులతో కూడిన విద్యను అందించడం జరుగుతుందన్నారు.మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మైనారిటీ వెల్ఫేర్ కు 4వేల కోట్లు కేటాయించిందని తెలిపారు.రాజీవ్ యువ వికాసం పేరు తొ రాష్ట్రం లోని నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి 6వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.నియోజకవర్గంలోని నిరుపేద ముస్లింలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత సామరస్యానికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు.ముస్లిలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ మీకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. రంజాన్ పండగ ముస్లిం సోదరుల జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ ఇఫ్తార్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు.జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులకు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. జనగామ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం మూడు లక్షల చొప్పున ఆరు లక్షలు పాలకుర్తి నియోజకవర్గం కి రెండు లక్షలు మొత్తంగా ఎనిమిది లక్షలు ఇఫ్తార్ లకు మంజూరు చేసినట్లు తెలిపారు.ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.అంతకుముందు ముస్లిం సోదరులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ని,కలెక్టర్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో ఆర్డిఓ డి.ఎస్.వెంకన్న,తహసీల్దార్ శ్రీనివాసరావు,ఏసీపీ భీమ్ శర్మ,పోలీస్ అధికారులు,మాజీ కోఆప్షన్ సభ్యులు ఇఫ్తార్ నిర్వాహకులు,ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.