
ఈ69న్యూస్ ఐనవోలు
హన్మకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో వెటర్నరీ హాస్పిటల్ కు వెటర్నరీ డాక్టర్ ను నియమించాలని గ్రామస్తులు,మండల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.మండల కేంద్రంలో వెటర్నరీ హాస్పటల్ లేక పోవడంతో పశువులకు ఏదేని వ్యాదులు లేదా ఏమైనా అవసరం పడటంతో రైతులు ప్రైవేట్ వెటర్నరీ డాక్టర్లను ఆశ్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.మండల కేంద్రంలో వెటర్నరీ డాక్టర్ లేక పోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వెటర్నరీ హాస్పిటల్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు.ఇప్పటికైనా అధికారుల స్పందించి పర్మనెంట్‌గా డాక్టర్ని ఏర్పాటు చేయాలని మరియు హాస్పటల్ కరెంటు సదుపాయం ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.