
ఈ69న్యూస్ సీతానగరం
ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం ద్వారా మనస్సు ప్రశాంతత,మానసిక ఒత్తిడి నివారణ,వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతాయని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వంగలపూడి మసీదు గురువు ముహమ్మద్ అక్బర్ పేర్కొన్నారు.శుక్రవారం సీతానగరం మండలం వంగలపూడి అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ మసీదు లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.ఖురాన్ ముస్లింలకు అత్యంత పవిత్ర గ్రంథం అని,ఇది దైవం నుండి ప్రవక్త ముహమ్మద్ పై అవతరించబడిన దివ్య సందేశం అని వివరించారు.ఖురాన్ గ్రంథం నేర్చుకోవడం మరియు కంఠస్థం చేయడం ముస్లింల పవిత్ర బాధ్యతని ఖురాన్ నేర్చుకొని,ఇతరులకు నేర్పే వాడు మీలో ఉత్తముడు అని ప్రవక్త ముహమ్మద్ బోధించారని అన్నారు.ఖురాన్ చదవిన ప్రతిసారి,ప్రతి అక్షరానికి పదింతల పుణ్యం లభిస్తుందని అదే విధంగా,పిల్లలను చిన్న వయస్సు నుంచే ఖురాన్ కంఠస్థం చేయడం ప్రోత్సహించాలని,ఖురాన్ పఠనంతో మానసిక ప్రశాంతత,కుటుంబ సౌభ్రాతృత్వం,సమాజ శ్రేయస్సు సాధ్యమవుతాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఖురాన్ నేర్చుకున్న వారిని ప్రోత్సహిస్తూ సన్మానించారు.ఈ సందర్భంగా వంగలపూడి మసీదు ప్రెసిడెంట్ షేక్ ఖాసీం ఫారూఖ్ మాట్లాడుతూ..ఖురాన్ పఠనం మనసును ప్రశాంతంగా,దుఃఖాన్ని తొలగించే ఔషధంగా పనిచేస్తుందని గృహాల్లో ఖురాన్ పఠనం వల్ల శాంతి వాతావరణం ఏర్పడుతుందని ఖురాన్ నేర్చుకున్న వారికి పరలోకంలో ఉన్నత స్థానం లభిస్తుందని,కంఠస్థం చేసిన వారికి పరలోకంలో ప్రత్యేకమైన గౌరవం ఉంటుందని ఇస్లాం బోధిస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమం ఆధ్యాత్మికత,సమాజ శ్రేయస్సు,మత సామరస్యాన్ని ప్రోత్సహించేందుకు ఒక మైలురాయి అని అహ్మదీయ ముస్లిం మత పెద్దలు అభిప్రాయపడ్డారు.ఖురాన్ అధ్యయనం,ఆచరణ ద్వారా సమాజం మొత్తం ఒక శాంతిమయమైన దిశగా సాగాలి అని పలువురు పేర్కొన్నారు.