
అమావాస్య సందర్భంగా అన్నదానం
కాంగ్రెస్ యువ నేత గోటిక గోపాల్ రెడ్డి ఆధ్యాత్మిక సేవలు
అమావాస్య సందర్భంగా అన్నదానం
షాద్ నగర్ పట్టణంలోని కోట మైసమ్మ చారిత్రాత్మక దేవాలయంలో అమావాస్య పూజలు శనివారం ఘనంగా జరిగాయి. ప్రతి అమావాస్య వేల జరిగే పూజలలో భాగంగా తొలి అమావాస్య పురస్కరించుకొని కోట మైసమ్మ ఆలయంలో హోమం అభిషేకం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నింటిని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు అయ్యవారి పలికి చెందిన గోటిక గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం అన్నదాన కార్యక్రమాలను గోపాల్ రెడ్డి తండ్రిగారైన గోటిక వెంకట్ రెడ్డి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నదాత వెంకటరెడ్డి దంపతులను పురోహితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు కొన్ని సంక్షేమ సమితి నాయకులు శుక్ర వర్ధన్ రెడ్డి, జర్నలిస్టు కెపి, మల్లేష్ గౌడ్, రామచంద్రయ్య విజయరాములు గౌడ్ మధురపురం మాజీ ఎంపిటిసి భార్గవ్ కుమార్ రెడ్డి జర్నలిస్టు ధరమపాల్ సింగ్, స్వాతి శివ, రామచంద్రయ్య, పెంటయ్య, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.