
ముఖ్యనాథస్వామి దేవస్థానంలో ఘనంగా ఉగాది ఉత్సవాలు

ఈ69న్యూస్:- హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని పురాతనమైన శ్రీ ముఖ్యనాథస్వామి దేవస్థానంలో విశ్వావసు నామ సంవత్స ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ ప్రజలు అందరూ ఉగాది పచ్చడి బోనం మరియు నైవేద్యం బోనంతో ఊరేగింపుగా ఆలయంకు చేరుకుని పరివార దేవత సహిత శ్రీ ముఖ్యనాథస్వామి వారికి సమర్పించారు.అదే విధంగా కుమ్మరి కులస్తులు తొలిసారిగా బద్ది పోచమ్మకు బోనం చెల్లించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గై కృష్ణమూర్తి,మాజీ ఎంపీటీసీ మేకల విజయ్ కుమార్,మాజీ వార్డ్ మెంబర్ ముంజ మహేందర్,గుంటిపల్లి వెంకట్ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం,పిల్లల హరిక అమ్మ వారు,ఆలయ చైర్మన్ శివసాని ప్రవీణ్,ప్రధాన కార్యదర్శి పల్లె రమేష్,ధర్మకర్తలు బోళ్ల శ్రీనివాస్,కోతి సాంబరాజు,గజవెల్లి శ్రీనివాస్,ఎర్ర చేరాలు,వేములకొండ సారయ్య,కందుకూరి రమేష్,కమిటీ సభ్యులు గూల్ల కొమురయ్య,కొన్నే రవీందర్ రెడ్డి,ల్యాగ శంకర్,సులుగూరి కృష్ణంరాజు,కోరుకొప్పుల అనిల్,బోళ్ల నరేష్,మారవేని యాదగిరి,శ్రీనివాస్,అన్నం అశోక్,దారపు వినోద్,చంద్రయ్య,గుంటి పల్లి సంపత్ కుమార్,ఎతిరాజుల నరసింహస్వామి,బోడ ఐలయ్య,కుమ్మం నగేష్,పిన్నింటి రాజీ రెడ్డి,గోనెల గణేష్,తదితరులు పాల్గొన్నారు.