లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందే
Jangaonసిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు
సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీసీ అంబేద్కర్ సెంటర్లో కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లే కార్డ్ లతో నిరసన~~~~~~~~
జనగామ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందని సిఐటియు జనగామ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున సిఐటియు కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో జనగామ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం ముందు ప్లేకార్డులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా తెచ్చి కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేసే కుట్రలు చేస్తుందని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కార్మిక వర్గానికి కనీస వేతనాలు లేక కనీస హక్కులు కూడా అమలు చేయడం లేదని, రోజుకు 178 కనీస కూలీ ప్రకటించి దేశ ప్రజలను కార్మిక వర్గాన్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. తినడానికి తిండి లేక పనికి తగ్గ కనీస వేతనాలు అమలు కాక అర్ధాకలితో కార్మిక వర్గం అల్లాడుతుంటే వారికోసం పట్టించుకోకుండా ధనవంతుల లాభాల కోసం పరిశ్రమ అధిపతుల లాభాల కోసం దేశ సంపాదన దోచుపెడుతున్నారని విమర్శించారు.ఇటు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక 73 జీవోల కాలపరిమితి ముగిసి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా వాటిని సవరించిన పరిస్థితి లేదని వారితోపాటు కార్మికుల తమ హక్కుల కోసం పోరాడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరిస్తూ కార్మిక వర్గాన్ని మోసం చేస్తుందని విమర్శించారు.రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యాలకు అన్ని రకాల అనుమతులను కల్పిస్తూ కార్మికులకు కనీస వేతనాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వీటివల్ల అభివృద్ధి అనేది పరిశ్రమ యజమానులకు తప్ప కార్మికులకు, దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడదని విమర్శించారు.అసంఘటిత రంగంలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులకు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కనీస వేతనాలు సౌకర్యాలను పగడ్బందీగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ జిల్లా కోశాధికారి సుంచు విజేందర్, జిల్లా కమిటీ సభ్యులు వడ్డేపల్లి బ్లెస్సింగ్ టన్ బూడిద ప్రశాంత్ టౌన్ కమిటీ సభ్యులు శివరాత్రి రాజు చీర శ్రీనివాస్ రమేష్ కంటి ఆంజనేయులు బండ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు