
ఈ69న్యూస్ హైదరాబాద్
అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సోమవారం రమజాన్ ఈదుల్ ఫితర్ నమాజ్ అనంతరం ఈద్ మిలన్ మరియు సర్వ ధర్మ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి స్థానిక అహ్మదీయ కమ్యూనిటీ అధ్యక్షులు మౌలానా హమీదుల్లా హసన్ అధ్యక్షత వహించగా కుల మతాలకతీతంగా హిందు,క్రిస్టియన్,బ్రహ్మకుమొరీస్,బౌద్ద ధర్మాల ప్రతినిధులు,పోలీస్ ఉన్నతాధికారులు,న్యాయవాదులు,ప్రొఫేసర్లు,వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అహ్మదీయ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు తన్వీర్ అహ్మద్,ఉపాధ్యక్షులు షేక్ షకీల్ అహ్మద్ అడ్వకేట్ వారికి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమానికి దాదాపు 120కి పైగా సభ్యులు హాజరయ్యారు.కమ్యూనిటీ వక్తలు”అందరినీ ప్రేమించు ఎవరినీ ద్వేషించకు”అనే నినాదంతో మతసామరస్యంతో కూడిన వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.హాజరైన ప్రముఖులు ఇలాంటి కార్యక్రమాలను అన్ని మతాలు కలసి నిర్వహించాలన్న ఆకాంక్ష వ్యక్తపరిచారు.ఈ సందర్భంగా అహ్మదీయ ముస్లిం పండితులు వక్తలు మాట్లాడారు.ఇస్లాం స్థాపకులు మహా ప్రవక్త ముహమ్మద్ (స.అ.స) “మీ కోసం కోరుకున్నదే ఇతరుల కోసం కూడా కోరుకోండని,అప్పుడే మీరు ప్రజలలో అత్యంత న్యాయవంతులవుతారని బోధించారు.ఇస్లాం ధర్మంలో ముస్లింలను మాత్రమే కాకుండా,సమాజంలోని ఇతరుల బాధలను అర్ధం చేసుకోవాలని,వారి దు:ఖాన్ని పంచుకోవాలని,తమ సంతోషాల్లో ఇరుగుపొరుగు వారిని భాగస్వాములుగా చేయాలని ఉపదేశిస్తుంది.ఈ బోధనను పాటించడం ద్వారా సమాజంలో న్యాయం,సమానత్వాన్ని పెంపొందించుకోవచ్చుననిఈ స్ఫూర్తిని అనుసరించి,అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ నేడు.భారతదేశ వ్యాప్తంగా ఈద్ ఉల్-పితర్ రంజాన్ పండుగ ఆనందాన్ని కుల,మతాలకు అతీతంగా ఇతర ధార్మిక పండితులతో,గురువులతో,ప్రముఖులతో,స్నేహితులతో,ఇరుగుపొరుగు ప్రజలతో పంచుకోవడమే ప్రధాన ఉద్దేశ్యంతోనే ఈద్ మిలన్,సర్వ ధర్మ సమ్మేళనాల కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.ఈద్ ఉల్-పితర్ పండుగ మత సామరస్యానికి ప్రతీక,రమజాన్ ఉపవాస దీక్షలు ముగిసిన అనంతరం,ముస్లింలు ఈద్ రోజున అల్లాహ్‌కు కృతఙ్ఞతలు తెలియజేసి,ఆయన్ని స్మరిస్తారు.నిజమైన ముస్లిం భక్తుడు ఈద్‌ను ఉల్లాసంగా జరుపుకుంటాడు.ఎందుకంటే రమజాన్ ఉపవాసాల ద్వారా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెంది.తన నీతి,నిగ్రహాన్ని మెరుగుపరచుకుంటాడు.అంతేకాక,అల్లాహ్ సామీప్యతను పొందేందుకు,తన ఆధ్యాత్మిక,నైతిక బలహీనతలను దూరం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు.అదే సమయంలో,పేదల పట్ల సానుభూతిని,దయా భావాన్ని అలవరుచుకుంటాడు.అల్లాహ్ మానవుని బంధాన్ని బలపరచడం,సమాజంలో ప్రేమ,శాంతిని వ్యాప్తి చేయడమే అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ లక్ష్యం.ఈ పవిత్ర లక్ష్యాన్ని నెరవేర్చడానికి అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ స్థాపకులు హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ (అ.స) అవతరించారు.ఈ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ,”అందరికీ ప్రేమించు”ఎవ్వరిని ద్వేషించకు”అనే నినాదంతో అహ్మదీయ కమ్యూనిటీ ప్రపంచ వ్యాప్తంగా మానవ సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు.భారతదేశం అనేక మతాలు,భిన్న సంస్కృతులు కలిగిన దేశం.ఇక్కడ ప్రజలు పరస్పర ప్రేమ,శాంతి,సామరస్యంతో జీవిస్తూ,ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకుంటారు.ఈద్ మిలన్ వంటి కార్యక్రమాలు సోదరభావాన్ని పెంపొందించి,ఇరుగుపొరుగు ప్రజల మధ్య ప్రేమ,స్నేహబంధాన్ని బలపరుస్తాయి.ఇది వివిధ సంస్కృతుల మధ్య ఐక్యతను పెంచేందుకు గట్టి పునాది వేసి,పరస్పరం అర్థం చేసుకోవడానికి,చర్చించుకోవడానికి ఒక వేదికను అందిస్తుందన్నారు.ప్రపంచం నేడు వేగంగా విద్వంసం వైపు పయనిస్తోంది.ఈ విధ్వంసాన్ని అడ్డుకోవాలంటే మనం దైవ మార్గాన్ని అనుసరించి,న్యాయాన్ని పాటించి,పక్షపాతం లేని జీవన విధానాన్ని అవలంబించాలి.సమాజ హితానికి ఇది ఏకైక మార్గం,ఎందుకంటే ప్రతి వ్యక్తి తన కోసం కోరుకున్నదే ఇతరులకు కూడా కోరుకోవాలి అప్పుడే ప్రపంచంలో శాంతి స్థాపన సాధ్యమవుతుందన్నారు.