సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాట వెనక్కి తీసుకోవాలి
Uncategorized
అరుణ ప్రభ వరంగల్
సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసు నిర్బంధాన్ని నిలిపివేయాలని అక్రమంగా విద్యార్థినేతలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఎం సాగర్ సీఐటీయూ వరంగల్ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని ప్రజాస్వామికంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం సమంజసం కాదన్నారు.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న యూనివర్సిటీ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తూ లాఠీచార్జి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.విద్యార్థి నేతలపై కేసులు పెట్టి వేధింపులకు పాల్పడడం మానుకోవాలని అన్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఇప్పుడిప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక తరగతుల నుండి పేద మధ్యతరగతి విద్యార్థులు యూనివర్సిటీలో విద్యను అభ్యసించేందుకు వెళుతున్న క్రమంలో విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసేందుకు ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించే కుట్రలో భాగంగా ఈ చర్యలకు పాల్పడుతుందని ఈ ప్రభుత్వ విధానాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని అయన కోరారు.రాష్ట్ర ప్రభుత్వం
యూనివర్సిటీ భూములను అమ్మాలనే అనాలోచిత నిర్ణయం వెనక్కి తీసుకోవాలి వెంటనే యూనివర్సిటీ భూముల్లో ఉన్న బుల్డోజర్లు జెసిబిలను బయటికి పంపాలని డిమాండ్ చేశారు.మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులను సిపిఎం నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.