
ఈ69న్యూస్ హన్మకొండ:-హెచ్.సి.యు.భూముల జోలికొస్తే రాష్ట్ర ప్రభుత్వ పతనం తప్పదని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.కేయూలో సీ.ఎం. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర, నిర్వహించి మొదటి గేటు వద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.దిష్టిబొమ్మ దగ్ధాన్ని అడ్డుకునేందుకు పోలీసులు,ప్రయత్నించగా విద్యార్థులకు,పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.కేయూ మొదటి గేటు ముందు రహదారిపై విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించారు.హెచ్.సి.యు.భూములను పెట్టుబడిదారులకు అప్పగించే ఆలోచనలను విరమించుకోవాలని.హెచ్.సి.యు.విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించి అక్రమ లాఠీ చార్జి,అరెస్టులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని.హెచ్ సి యు విద్యార్థుల న్యాయమైన పోరాటానికి కె.యు విద్యార్థుల సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి ఎ.ఐ.ఎస్.ఎఫ్,యు.ఎస్.ఎఫ్.ఐ,డి.ఎస్.ఏ,పి.డి.ఎస్.యు,ఎం.ఎస్.ఎఫ్,ఎస్.ఎస్.యు,బి.ఎస్.యు,బి.ఎస్.ఎఫ్,విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.