
ఈ69న్యూస్ హన్మకొండ
తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్ష పూర్ పరిదిలోని హౌజ్ బుజుర్గ్ గ్రామంలో అహ్మదీయ ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో ఖుర్ఆన్ బిస్మిల్లా ప్రారంభం ప్రోగ్రాం గ్రామ అధ్యక్షులు షేక్ సయ్యద్ వలీ అద్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు వరంగల్ పట్టణ అధ్యక్షులు ముహమ్మద్ సలీం ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం గ్రామానికి చెందిన మౌల్వీ యాకూబ్ అలీ కుమారుడు సయ్యద్ ఫవాద్ అహ్మద్ (7)తో ఖుర్ఆన్ గ్రంథం అరబ్బి బాషలో బిస్మిల్లాహ్ పఠనంతో ప్రారంబింపజేశారు.అనంతరం వారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.ఖుర్ఆన్ భగవంతుని వైపు నుండి ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ పై అవతరించిన గొప్ప గ్రంథమని ప్రతీ ఒక్కరు వయోజనులు,యువకులు,మహిళలు,బాల,బాలికలు తప్పకుండా ఖుర్ఆన్ అరబ్బీ భాషలో నేర్చుకుని అనువాదం తమకు వచ్చిన మాతృ భాషలో చదువుకొని అర్థం చేసుకుని అమలు చేయాలని అన్నారు.ఖుర్ఆన్ చదవడం వలన మానసిక ప్రశాంతత ఉత్పన్నమై జ్ఞానం,జ్ఞాపక శక్తి పెరుగుతుందని అన్నారు.అహ్మదీయ ముస్లిం జమాత్ ప్రతీ గ్రామంలో మౌల్వీలను నియమించి ఖుర్ఆన్,ధార్మిక గ్రంథాలను నేర్పించడానికి కృషి చేస్తుందన్నారు.పిన్న వయసులో ఖుర్ఆన్ చదవడం మొదలు పెట్టిన బాలుడిని ప్రశంసించారు.అనంతరం స్థానిక మౌల్వీ ముహమ్మద్ బషీర్ మాట్లాడుతూ…చిన్నతనంలో ఖుర్ఆన్ ను సులువుగా నేర్చుకోవచ్చన్నారు.తల్లి దండ్రులు తమ పిల్లలను ఖుర్ఆన్ నేర్చుకునేందుకు మస్జిద్ కు పంపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు సయ్యద్ ఇఫ్తికార్ అహ్మద్,సెక్రెటరీ తాలీం ఉమర్ ఖాన్,తాహిర్ హుస్సేన్,యాకూబ్,డాక్టర్ హుస్సేన్,అక్బర్ కొండూరి,మహమూద్ పాషా నల్లగుంట,సయ్యద్ కరీం,ముజాహిద్,షబ్బీర్,మోదీన్,యాకూబ్,ఫరీద్,సయ్యద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఖురాన్ ను ఆదరించేవారు ఆకాశంలో ఆదరించబడతారు,
ఖురాన్ చుట్టూ తిరగాలి, అని నా ఆశ ఎందుకంటే నా యొక్క కాబా ఖురాన్ ……
హజ్రత్ మీర్జా గులాం అహ్మద్ అలైహిస్సలాం
మీకు కృతజ్ఞతలు తెలుపుటకు సంతోషిస్తున్నాను.
Mashallah bahut bahut mubarak ho Allah tala aapke kaam me Barkat dale ameen
Thank you so much