
సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్
సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్
జనగామ ఆర్టిసి డిపో పరిధిలో పనిచేస్తున్న స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సుంచు విజేందర్ కోరారు. శుక్రవారం రోజున సిఐటియు ఆధ్వర్యంలో జనగామ డిపో మేనేజర్ s స్వాతి కి సూపర్ లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు ఈ సందర్భంగా సుంచు విజేందర్ మాట్లాడుతూ డిపో బస్టాండ్ ఆవరణలో పనిచేస్తున్న స్వీపర్లు మెకానికులు వివిధ కేటగిరీల వారిగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని వారు కోరారు. స్వీపర్లకు యూనిఫామ్స్ గుర్తింపు కార్డులు సబ్బులు నూనెలు గ్లౌజులు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇన్సూరెన్స్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈఎస్ఐ కార్డు భోజనం విరామం సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి గది ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కమల రేణుక శోభ స్వప్న స్వరూప సువార్త కోమల లక్ష్మి రేణుక శోభ తదితరులు పాల్గొన్నారు