
ఈ69న్యూస్ జనగామ/లింగాల గణపురం
లింగాల గణపురం మండలంలోని నాగారం గ్రామంలో సిపిఐ పార్టీ గ్రామ శాఖ సమావేశం బొట్ల రాములు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి లింగాల గణపురం సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రావుల సదానందం హాజరై మాట్లాడుతూ..రేషన్ కార్డు తప్పనిసరి నిబంధన తొలగించి రాజీవ్ యువ వికాస పథకము గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ,బీసీ మైనార్టీ ఈ బీసీ నిరుద్యోగులైన యువతకు రూ.50 వేల నుండి నాలుగు లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలు అందజేసి ఉపాధి కల్పించే మంచి సంకల్పంతో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం స్వాగతించదగినన్నారు.కానీ ఇందులో పెట్టిన నిబంధనలు నిరుద్యోగ యువతకు గుది బండగా మారాయి అన్నారు.గత 11 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులు లేనందున నిరుద్యోగ యువత నష్టపోయే అవకాశం ఉంది కావున రేషన్ కార్డు మినహాయించి దరఖాస్తులు తీసుకోవాలని అలాగే గడువును కూడా పొడిగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.సిపిఐ గ్రామ శాఖ జనరల్ సెక్రెటరీ మరాటి చంద్రయ్య జాయింట్ సెక్రెటరీ కిమిడిశ్రీశైలం ఏకగ్రీవంగా ఎన్నికైనారు.నాయకులు బొట్ల మహేందర్ సమావేశంలో నరేష్.ప్రశాంత్.ఎల్లయ్య.ఉనిల్,స్వామి,రవి,శ్రీను రవి సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.