
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు,ప్రఖ్యాత కార్మికోద్యమ నేత కామ్రేడ్ బి.టి.రణదివే 35వ వర్ధంతి సందర్భంగా సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు.వర్ధంతి సభకు నీల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా,జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు మాట్లాడుతూ..బి.టి.రణదివే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి,కార్మికుల హక్కుల కోసం చారిత్రాత్మక ఉద్యమాలు చేసిన మహోన్నత నేత.ఆయన స్ఫూర్తితోనే కార్మికులు ఈ రోజు కూడా ఉద్యమపథంలో ముందుకు సాగాలి అని పేర్కొన్నారు.ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక నలుగురు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.మే 24న కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెకు విజయవంతంగా మద్దతుగా నిలవాలని,కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల పట్టణ నాయకులు బోస్,రాజేంద్రప్రసాద్,గుర్రం లాజర్,కుంభం రాజు,పూర్ణచందర్,చిరంజీవి,అనిల్,ప్రమోద్,సారయ్య, గిరవేణి రాజు,వెంకటస్వామి,విజయ్,గజేందర్,బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.