
అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువుల సహాయం

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువుల సహాయం
ఈ69న్యూస్ పెద్ద పారుపూడి
పెద్ద పారుపూడి మండలంలోని జమ్మిదింటకుర్రు గ్రామంలో ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన ఆకుల సుబ్బమ్మ ఇంటిని సందర్శించిన అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ హ్యూమానిటీ ఫస్ట్ శాఖ వాలంటీర్లు,బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు.ఈ సహాయ కార్యక్రమం కమ్యూనిటీ మానవ సేవా విభాగం ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా కృష్ణా జిల్లా యువకుల అధ్యక్షులు షేక్ బాపూజీ మాట్లాడుతూ…అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీని 1889లో హజ్రత్ మిర్జా గులామ్ అహ్మద్ (అ.స) భారతదేశంలో స్థాపించారు.ప్రస్తుతం ఈ సంఘం 200కి పైగా దేశాల్లో అందరినీ ప్రేమించు–ఎవ్వరినీ ద్వేషించకు’అనే నినాదంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ,విశ్వశాంతి కోసం కృషి చేస్తోంది,అని తెలిపారు.హ్యూమానిటీ ఫస్ట్ శాఖ ఇంచార్జ్ షేక్ ఇస్మాయిల్,ఈ మానవతా సంస్థ 220కి పైగా దేశాలలో విస్తరించి,విపత్తు సమయంలో బాధితులకు సహాయం అందించడంలో ముందుంటోంది అని పేర్కొన్నారు.కృష్ణా జిల్లా ఇంచార్జ్ మమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ..”ప్రపంచంలోని ఎక్కడ విపత్తులు వచ్చినా మేము సహాయహస్తం అందించేందుకు సిద్ధంగా ఉంటాం.మానవత్వం పరంగా ఈ సేవలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాం.మహనీయ ముహమ్మద్ ప్రవక్త (స) బోధించిన సర్వ మానవులు అల్లాహ్ కుటుంబమే అనే సందేశాన్ని అనుసరిస్తున్నాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ప్రెస్ ఇంచార్జ్ మహమ్మద్ యాకూబ్ పాషా,షేక్ హైదర్ వలీ సాహెబ్,ముబల్లిగ్ సిల్సల షేక్ సిలార్ సాబ్,షేక్ మీరావలి,షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.వాలంటీర్ల సేవలతో కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగింది.