శివనగర్‌లో బీజేపీ క్రియాశీల సభ్యుల సమావేశం
ఈ69న్యూస్ వరంగల్/స్టేట్ బ్యూరో రిపోర్టర్ ముహమ్మద్ సలీం
వరంగల్ తూర్పు నియోజకవర్గం 34వ డివిజన్ శివనగర్‌లో బీజేపీ కార్యకర్తల సమావేశం బుధవారం జరిగింది. మండల అధ్యక్షుడు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, సీనియర్ నేత సముద్రాల పరమేశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజల్లో అవగాహన పెంచే విధానాలపై నేతలు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తాగునీటి సమస్య, అభివృద్ధిలో ఆలస్యాలు వంటి అంశాలపై ప్రజల మధ్య పోరాటం అవసరమని తెలిపారు.ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ చేసిన అభివృద్ధిని కార్యకర్తలు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి బైరి శ్యాంసుందర్,తాళ్లపల్లి శ్రీనివాస్,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగవిల్లి సునీల్‌తో పాటు పలువురు బూత్ అధ్యక్షులు,శక్తికేంద్ర ఇన్చార్జులు,కార్యకర్తలు పాల్గొన్నారు.