
అందే సత్యనారాయణ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్న రాజనాల శ్రీహరి
ఈ69న్యూస్ వరంగల్/స్టేట్ బ్యూరో రిపోర్టర్ ముహమ్మద్ సలీం
నెక్కొండలో ఇటీవల మృతి చెందిన ప్రముఖ నాయకుడు అందే సత్యనారాయణ పెద్దకర్మ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి పాల్గొన్నారు.అవకాశాన్ని ఉపయోగించుకుని,ఆయన సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..”సత్యనారాయణ సమాజానికి ఎంతో సేవలు అందించిన వ్యక్తి.ఆయన మృతి ద్వారా కలిగిన లోటు పూడ్చలేనిది”అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కుమారస్వామి,రవి,ఇతర కుటుంబ సభ్యులు,బంధువులు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.