
ఈ69న్యూస్ ధర్మసాగర్/రిపోర్టర్ స్టీఫెన్(ప్రణయ్)
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు హనుమకొండ జిల్లా ఎంఎస్పి అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ మాదిగ,బొడ్డు శాంతి సాగర్ లు మాట్లాడుతూ..మహనీయులు జ్యోతిరావు పూలే అంటరానితనం,కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు,మహిళోద్ధరణకు,సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక గీటురాయి,దీటురాయి. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం,అన్ని మతాలు కులాల ప్రజలు సామాజిక సంస్కరణ ఉద్యమంలో చేరవచ్చునని సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. మహిళా అనే వివక్ష,మహిళలకు చదువెందుకనే రోజుల్లో తన సతీమణి సావిత్రిబాయి పూలే కు విద్యపట్ల ఉన్నటువంటి శ్రద్ధను గ్రహించి ప్రోత్సహించిన వ్యక్తి,విద్యను సమర్ధించిన మొదటి సంస్కర్త కూడా అతని ప్రోత్సాహంతోనే సావిత్రిబాయి పూలే మహిళా ఉపాధ్యాయురాలిగా, విద్యకు మార్గదర్శకురాలిగా ఆదర్శప్రాయంగా నిలిచిందని చెప్పారు.బాలికల కోసం పూణే ళో వీరు పాఠశాలను కూడా ప్రారంభించారు, వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. విద్య యొక్క విశ్వీకరణను సమర్ధించిన మొదటి సంస్కర్త కూడా ఈయనే ఇలాంటి మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని
ఈసందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు,మండల అధ్యక్షులు సోంపల్లి అన్వేష్,ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి చిలుక రాజు,వి హెచ్ పి ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల బాబు,నక్క రమేష్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.