
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం
ఈ69న్యూస్ జఫర్ఘడ్
తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి,ప్రస్తుత కడియం నియోజకవర్గ శాసనసభ్యులు కడియం శ్రీహరి ప్రజల సంక్షేమానికి తమ నిబద్ధతను కొనసాగిస్తూ,ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయాన్ని అందజేశారు.ఇటీవలి కాలంలో అనారోగ్యానికి గురైన నక్క రామచంద్రుకు రూ.56,000/-మరియు మహమ్మద్ నజీమా రఫీకి రూ.38,000/-విలువగల చెక్కులను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేయించి,వారికి అందజేయడం జరిగింది.ఈ చెక్కులు శాసనసభ్యులు కడియం శ్రీహరి సహకారంతో,స్థానిక నాయకులు అన్నం బ్రహ్మరెడ్డి ప్రత్యేకంగా శ్రమించి ఇప్పించారు.ఈ సందర్భంగా బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,పిఎసిఎస్ చైర్మన్,మండల పార్టీ అధ్యక్షులు,మాజీ మార్కెట్ చైర్మన్లు,మాజీ ఎంపీపీలు,మాజీ జడ్పీటీసీలు,మార్కెట్ డైరెక్టర్లు,మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు,మండల ప్రముఖులు,కడియం అభిమానులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కడియం శ్రీహరి చేస్తున్న సేవా కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.