ధర్మసాగర్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఈ69న్యూస్ ధర్మసాగర్, ఏప్రిల్ 14: డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని ధర్మసాగర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఘనంగా నిర్వహించింది.ఈ కార్యక్రమానికి గంగారపు శ్రీనివాస్ మాదిగ (ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సమానత్వాన్ని,హక్కులను కల్పించి ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు అందించే దిశగా పునాదులు వేసారని తెలిపారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16లు దళితులు,మహిళలు,వెనుకబడిన వర్గాలకు రక్షణగా నిలుస్తున్నాయని అన్నారు.బొడ్డు శాంతి సాగర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు,స్థానిక ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.