
ఈ69న్యూస్ హనుమకొండ:-భీమదేవరపల్లిలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను బుధవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు రెండు రోజుల్లో రూ.1 లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇండ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మోడల్ హౌస్‌ను కూడా పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు.