
ఈ69న్యూస్ హనుమకొండ:- జిల్లా భీమదేవరపల్లిలో నిర్మాణంలో ఉన్నఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు.లబ్ధిదారులతో మాట్లాడిన ఆమె, ఇంటి నిర్మాణానికి తీసుకున్న సమయం,ఖర్చు,మేటీరియల్ వాడకం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు రెండు రోజుల్లో రూ.1 లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ హౌస్‌ను కూడా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్డీవో రాథోడ్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.