ఓ యువకుడు తన పుట్టినరోజు వేడుకలను హంగుఆర్భాటంగా నిర్వహించుకోకుండా సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన నవ తెలంగాణ రిపోర్టర్ గాజరి శ్రీకాంత్ తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం రిమ్స్ లో రక్తదానం చేసి తమ ఉదరతను చాటుకున్నారు. ప్రతి పుట్టినరోజు నాడు రక్తదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే మూడవ సారి రిమ్స్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసి యువతకు మంచి సామాజిక మెసేజ్ ను పంపారు. రక్తదానం చేసి రక్తహీనులను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్లు మెడపట్ల సురేష్, సుధాకర్, రవి, మహేష్ వైద్య సిబ్బంది ఉన్నారు.