
తేదీ: 6-12-2022..
SFI మాజీ రాష్ట్ర అధ్యక్షుడు S. వీరయ్య గారు..
SFI జాతీయ మహాసభలు జయప్రదం చేయండి..
ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వడ్రనపు మధు..
ఖమ్మం:- ఎస్ ఎఫ్ ఐ ఖమ్మం జిల్లా కమిటీ అధ్వర్యంలో IMA హల్ లో నూతన విద్య విధానం పై సెమినార్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ అధ్యక్షతన జరిగింది.. ఈ సెమినార్ కి ముఖ్యఅతిథిగా మాజీ ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. వీరయ్య గారు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సెమినార్ లో మాట్లాడుతూ :- నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ.. ఉన్నత విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం శరవేగంగా ప్రైవేటీకరిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో విద్యారంగానికి కనీస నిధులు కేటాయించడం లేదన్నారు.. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ,ప్రైవేటు గ్లోబల్ యూనివర్సిటీలను ఆహ్వానించడం హేయమైన చర్య అన్నారు.. పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తూ సంపన్న వర్గాలకే చదువులు అన్న మాదిరిగా పాలకుల తీరు ఉందన్నారు. ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీలు భారతదేశానికి రావాలని ఈ విధానం స్వాగతం పలుకుతోందనీ, తద్వారా ప్రపంచ స్థాయి ఉన్నత విద్య కోసం మన విద్యార్థులు విదేశాలకు పోవాల్సిన అవసరం ఉండదనీ, చాలా ఖర్చు తగ్గుతుందనీ, స్వదేశంలోనే విదేశీ విద్యను నేర్చుకోవచ్చని చెబుతోందన్నారం.. కానీ ఉన్నత విద్యాభివృద్ధి పేరుతో ఏర్పాటుచేసే ఈ ప్రయివేటు యూనివర్సిటీలు, అటానమస్ డిగ్రీ కాలేజీలు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు ఉండవు. అలాంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తరగతుల్లోని పేదలకు చదువుకునే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య రంగానికి బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించాలి ఖాళీగా ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ లని ఆపాలి ప్రభుత్వ యూనివర్సిటీ లని అభివృధి చెయఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వడ్రానపు మధు మాట్లాడుతూ :- ఎస్.ఎఫ్.ఐ 17 జాతీయ మహాసభలకు 13 నుండి 16 వరకు హైదరాబాదులోని ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరుగుతున్నాయి.. దేశంలోని 29 రాష్ట్రాల నుండి 800 లకు పైగా విద్యార్థి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ మహాసభలో నాలుగు రోజుల పాటు దేశంలోని విద్య, ఉపాధి, ఇతర రంగాల గురించి లోతైన చర్చ జరుపనున్నారు. విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు మౌలిక సదుపాయాలు, ప్రొఫెసర్ల కొరత, ప్రభుత్వ యూనివర్సిటీల పరిస్థితి, పైన భవిష్యత్తు ఉద్యమాన్ని కార్యచరణ రూపొందిస్తారు.. కావున విద్యార్థులు పెద్ద మొత్తంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు…